రైతుబాంధవుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి -అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 130

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటున్న బాందవుడు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం మండలంలోని చండ్రమాకుపల్లెలో ఏవో సంధ్య ఆధ్వర్యంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేసి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో 1520 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాల కోసం రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎన్నడు లేని విధంగా రైతుల పంట భీమాను కూడ అదే సంవత్సరంలో రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. క్యాలెండర్‌ ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు వేమారెడ్డి, ప్రభాకర్‌నాయక్‌, సిద్దారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఏఈవో జయంతి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Raitubandhavudu YS Jaganmohan Reddy-Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page