విశాఖ హెచ్‌పిసిఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

0 25

విశాఖపట్నం ముచ్చట్లు:

 

ప్రముఖ పారిశ్రామిక కంపెనీ హెచ్‌పిసిఎల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు రావడంతో సైరన్‌ మ్రోగింది. దీనిని గమనించిన కార్మికులు ఆందోళనలతో అరుపులు, కేకలు వేస్తూపరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించి, మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్‌ను పూర్తిగా మూసివేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని , దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Massive fire in Visakhapatnam HPCL

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page