వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ భీషణ నృసింహ పూజ‌

0 48

తిరుమల ముచ్చట్లు :

 

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా నృసింహ జ‌యంతిని పుర‌స్కరించుకుని తిరుమల‌ వసంత మండపంలో మంగ‌ళ‌వారం శ్రీ భీషణ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉదయం 8.30 నుండి 10.30 గంటల‌ వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.ఇందుకోసం శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని నృసింహ అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చారు. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ప్ర‌తిమ‌లను ఆశీనుల‌ను చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన హంపీ క్షేత్రానికి చెందిన శ్రీ గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ మాట్లాడుతూ బాలుడైన భ‌క్త ప్ర‌హ్లాదుడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌గ‌వంతుని ప్రార్థించ‌గా నృసింహావ‌తారంలో శ్రీ‌మ‌హావిష్ణువు ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు తెలిపారు. చ‌తుర్ద‌శి రోజున సంధ్యా స‌మ‌యంలో న‌ర‌సింహుడు ఆవిర్భ‌వించి దుష్టసంహారం చేసిన‌ట్టు వివ‌రించారు. నృసింహ జ‌యంతి రోజున స్వామివారిని ప్రార్థిస్తే వ్యాధి బాధ‌లు తొల‌గుతాయ‌ని, క‌ష్టాలు దూర‌మ‌వుతాయ‌ని చెప్పారు. శేషాచ‌ల క్షేత్రంలో టిటిడి నిర్వ‌హిస్తున్న ఇలాంటి కార్య‌క్ర‌మాల వ‌ల్ల మాన‌వాళికి శాంతిసౌఖ్యాలు క‌లుగుతాయ‌న్నారు.

 

 

 

- Advertisement -

వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్‌.వి.మోహ‌న‌రంగాచార్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మానవాళికి దూరం చేయాలని ప్రార్థిస్తూ శ్రీ భీషణ నృసింహ పూజ నిర్వహించినట్టు తెలిపారు. పూజ‌లో భాగంగా నృసింహ మంత్రాన్ని 108 సార్లు, సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్రనాథ్‌, అర్చ‌క‌స్వాములు, వేద‌పండితులు, వేద‌పారాయ‌ణ‌దారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Scientific worship of Sri Bhishana Nrusimha in Vasantha Mandapam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page