అపోలో గ్రూప్స్ ఆధ్వర్యంలో లో అరగొండ లో ఉచిత కోవిడ్ ఐసోలేషన్ కేర్ సెంటర్

0 27

– గ్రామీణ ప్రాంతంలో ఆక్సిజన్ అందుబాటులో ఉన్న ఐసోలేషన్ సెంటర్

 

అరగొండ ముచ్చట్లు :

 

- Advertisement -

ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి చిత్తూరు జిల్లాలో విజృంభించిన నేపథ్యంలో అపోలో గ్రూపు సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కరోనా రోగులను ఆదుకోవడానికి తన వంతు సాయం అందించారు. చిత్తూరు తన సొంత జిల్లా కావడంతో తన సొంత మండలంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న తపనతో ముందుకొచ్చారు. ఇందులో భాగంగాఅపోలో గ్రూప్స్ ఆధ్వర్యంలో అరగొండలో నిర్వహిస్తున్న సంపూర్ణ ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి రోగులకు ఉచిత వైద్యంతో పాటు పలు సదుపాయాలను అందిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రూ. లక్షల విలువైన కోవిడ్ వైద్యం ఉచితంగా అందుతోంది. ఎలాంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు అపోలో కోవిడ్ కేర్ సెంటర్ కల్పతరువుగా నిలిచింది.

 

 

తవణంపల్లె లోని అపోలో టోటల్ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను చిత్తూర్ అపోలో మెడికల్ కాలేజ్ యూనిట్ హెడ్ నరేష్ కుమార్ రెడ్డి -పరిశీలించారు. ఈ సందర్భంగా కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవల్ని ఆయన వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగి పైన ప్రత్యేక దృష్టి సారించి వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత మండలం, పుట్టిన గ్రామానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో..కరోనా సమయంలో ఉచితంగా ఆక్సిజన్ సదుపాయం గల కోవిడ్ కేర్ సెంటర్ ను తవణంపల్లె మండలం అరగొండ లో అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఏర్పాటు చేసినట్లు, కోవిడ్ బాధితులకు నాణ్యమైన వైద్యం తో పాటు మంచి భోజనం ఐసోలేషన్ వసతులను కల్పించడంలో ఎక్కడా రాజీ పడొద్దు అని చైర్మన్ చెప్పినట్లు నరేష్ రెడ్డి వెల్లడించారు.ఆరగొండ సంపూర్ణ ఆరోగ్యం సి.ఈ.ఓ.సుబ్బన్న మాట్లాడుతూ కరోనా రోగులకు వైద్యం పూర్తిగా ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటుకు అపోలో సంస్థ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోటల్ హెల్త్ సీఈవో డాక్టర్ సుబ్బన్న, మేనేజర్ ధనంజయ పాల్గొన్నారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Free Kovid Isolation Care Center in Aragonda under the auspices of Apollo Groups

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page