చక్రస్నానంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

0 37

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.ఉద‌యం 8.30 నుండి 10.30 గంటల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

- Advertisement -

కాగా సాయంత్రం 5.30 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు  .శ్రీ‌నివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్  ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు  వెంక‌టాద్రి,  కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  మునీంద్ర‌బాబు,  కామ‌రాజు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Brahmotsavalu of Sri Govindarajaswamy ending with Chakrasnanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page