జర్నలిస్టుల సమస్యలపై వాంభేకాలనీ ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా దర్గాలో ప్రార్ధనలు

0 29

విజయవాడ ముచ్చట్లు :

 

కరోనా కష్టకాలంలో శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్ట్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లోని ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.విధి నిర్వహణలో కరోనా బారిన పడి ప్రాణాలు విడిచిన సహచర జర్నలిస్టులకు సంతాపం ప్రకటించి ..ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని పాత్రికేయులు కోరారు.అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రభుత్వాలు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు …భగవంతుడు పాలకుల మనసు కరిగించి జర్నలిస్టు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేలా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags:Prayers at A Garib Nawaz Khaza Baba Dargah

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page