జిల్లాలోని ప్రతి ఉపాధి కుటుంభానికి వందరోజులు పనులు కల్పించాలి- ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుమత్యంశెట్టి విశ్వనాథం

0 26

– పురోగతి సాధించకుంటే వేటు తప్పదని హెచ్చరికలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జాబ్‌ కార్డు కల్గిన ప్రతి కుటుంభానికి వంద రోజులు పనులు కల్పించాలని ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మత్యంశెట్టి విశ్వనాథం సూచించారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, డ్వామా ఏపీడీ రామాంజనేయుల ఆధ్వర్యంలో సిబ్బందితో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ కోవిడ్‌ విజృంభిస్తున్నందన గ్రామాల్లో నిబంధన లను పాటిస్తూ కూలీలకు పనులు కల్పించాలన్నారు. నీటి నిల్వపనులతోపాటు, పూడిక తీత, సరిహద్దు కందకాలు, చెరువు చుట్టూ ట్రెంచ్‌లుతోపాటు పండ్ల తోటలపెంపకం పనులపట్ల దృష్టిసారించాలన్నారు. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కేటాయించాలని,. అవసరమైన కొత్తపనులు గుర్తించి ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.పెద్దిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టు లు ఖాలీలున్నాయని, వాటిని వెంటనే భర్తీచేసి కూలీలకు పనులిచ్చి ఆర్థికంగా కూలీలకు తోడ్పడాలన్నారు. డ్వామా ఏపిడీ రామాంజనే యులు మాట్లాడుతూ పురోగతిలో వెనుకంజలో ఉన్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పదిరోజుల్లో పంచాయతీ వారీగా కేటాయించి లక్ష్యాలను చేరుకోకుంటే వారిపై వేటు తప్పజిదని హెచ్చరించారు. పంచాయతీ వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రామమూర్తి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు చంద్రహాస్‌, ఏపిడీ శ్రీనివాసులు, ఏపిఓ శ్రీనివాస యాదవ్‌, తదితరులున్నారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Every employed family in the district should be provided with 100 days of work – EGS State Council Member Matyamsetti Viswanath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page