టాటాల ఔదార్యం 

0 28

అమరావతి ముచ్చట్లు:

 

భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా టాటా గ్రూప్ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు మరియు సిబ్బంది ఎవరైనా కరోనా వైరస్, చనిపోతే ఆ కుటుంబ సభ్యులు చింతించ కండి.. వాళ్లు మా యొక్క టాటా కంపెనీ లలో సజీవంగా పనిచేస్తున్నట్టు గానే భావిస్తాం..వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చి వారి వయస్సు 60 సంవత్సరాలు నిండే వరకు ప్రతి నెల ఒకటో తారీకు నాడు ఇప్పుడు తీసుకుంటున్న జీతాన్ని యధావిధిగా చెల్లిస్తాం, ఆ తర్వాత వారిని సగౌరవంగా రిటైర్మెంట్ చేసి వారికి రావలసిన అన్ని బెనిఫిట్స్ కూడా చెల్లిస్తాం.. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం, వాళ్ళకి ఇచ్చిన హౌస్ QUARTER ఫెసిలిటీ కొనసాగిస్తాం,వాళ్ల కుటుంబానికి వైద్య సదుపాయాన్ని ఎల్లవేళలా ఉచితంగా అందిస్తాము..వాళ్ల పిల్లలకు డిగ్రీ చదువు వరకు ఉచితంగా మేమే చెప్పిస్తాము,అర్హతలు ఉన్న వారిని ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని TATA గ్రూప్ సంస్థలలో ఉద్యోగులుగా తీసుకుంటాం అని టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా గారు ప్రకటించడం జరిగింది… నిజంగా దేవుడు స్వామి మీరు, ప్రపంచ చరిత్రలో ఏ పారిశ్రామికవేత్త కూడా ఎంత గొప్ప నిర్ణయం తీసుకోలేదు.. ఈ పోస్టింగ్ రాస్తున్నప్పుడు నాకు మీ పట్ల ఎనలేని గౌరవం, కృతజ్ఞత భావంతో గొంతు బొంగురు పోయింది, కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి…నిజంగా మీరు దేవుడు..పూర్తి మానవతా విలువలు కలిగిన విలువల తో వ్యాపారం చేసే గొప్ప పారిశ్రామికవేత్త.

 

 

 

- Advertisement -

వాస్తవానికి టాటా సంస్థలు ఈ సహాయం చేయడం మొదటిది కాదు.. మన సనాతన భారతదేశం అంటే వాళ్ళకి ఎనలేని ఆరాధన, కృతజ్ఞత భావం..కరోనా వైరస్, మొదటి దశలో 2 వేల కోట్ల రూపాయలను టాటా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాయి.. మోడీ గారు మీరు చింతించవద్దు కావాలంటే నా యావదాస్తిని అమ్మి భారతదేశం బాగుండడానికి ఇస్తాను…ఈ దేశం నాకు సర్వస్వము ఇచ్చింది.. మీరు ఏమి కావాలన్నా అడగండి,నేను ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధము అని రతన్ టాటా గారు ప్రకటించారు..ONLY MONEY విరాళంగా కాకుండా లక్షల TESTING KITS అందజేశారు, N95 మాస్కులు,PPE KITS అందజేశారు,ఇతరత్రా మొత్తం కలిపి 10 వేల కోట్ల రూపాయల సహాయం చేసిన మహానుభావుడు రతన్ టాటా గారు..ఇంత సహాయం దేశంలో ఏ ఒక్కరూ చేయడం జరగలేదు..మానవత్వం విలువల రూపంలో ఉన్న నిలువెత్తు దేవుడు రతన్ టాటా .

 

 

 

కరోనా వైరస్ రెండవ దశలో కూడా మొట్టమొదట స్పందించింది టాటా గారు మాత్రమే.. భారతదేశమా భయపడకు, నేను అండగా ఉన్నాను.. మోడీగారుచింతించకండి మొత్తం మాకంపెనీలలో ఆక్సిజన్ ఉత్పత్తిని వందరెట్లు పెంచుతాం.. సకాలంలో అన్ని రాష్ట్రాలకు మేమే దగ్గరుండి సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది.. చెప్పిన ప్రకారం రోజు వెయ్యి టన్నుల ఆక్సిజన్ టాటా కంపెనీలలో, సంస్థలలో ఉత్పత్తి చేయడం జరిగింది…లక్షలటన్నుల ఆక్సిజన్‌ను వేల ట్యాంకర్లలో ఉచితంగా ప్రతి రాష్ట్రానికి పంపించడం జరిగింది.. బెంగాల్లో సింగూర్‌లో కార్ల పరిశ్రమ పెట్టకుండా MAMATA BEGUM అడ్డుకుంటే.. దానిని ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా వేల ట్యాంకర్ ఆక్సిజన్‌ను బెంగాల్‌కు పంపించడం జరిగింది..లక్షలాది మందికి ప్రాణవాయువు అందించి, ప్రాణం పోయడం జరిగింది… ఒక్కొక్కటి కోటి రూపాయలు ఖరీదు చేసే ఆక్సిజన్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో 500 టాటా సంస్థ స్వయంగా నిర్మించి ఇవ్వడం జరిగింది.. సహాయం ఆగదు ప్రజల కష్టం పెరిగితే ఇంకా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది.. హిందూ భారతదేశమే మాకు సర్వస్వం ఇచ్చింది,సదా రుణపడి ఉంటాము.. మా యావదాస్తి, సర్వస్వము అమ్మి అయినా దేశాన్ని నిలబెడతామని ప్రకటించడం జరిగింది.. ఇంతటి గొప్ప పారిశ్రామికవేత్త మీకు భారత దేశంలో ఎక్కడా కూడా కనిపించడు.

 

 

 

 

 

*వాస్తవానికి టాటా లది భారతదేశం కాదు, వాళ్లది పాత PERSIAN దేశం..ప్రస్తుతం ఇరాన్ దేశం.. దండయాత్రలలో అందరినీ ఊచకోత కోసి నపుడు ఈ పార్సీ మతస్థుల టాటా సంస్థలకు చెందిన పూర్వీకులు పారిపోయి భారత దేశానికి స్వతంత్రం BEFORE రావడం జరిగింది.. వచ్చినప్పటి నుండి సనాతన హిందూ భారతదేశాన్ని తమ మాతృభూమి గానే భావించారు ఎనలేని సేవ చేశారు, స్వాతంత్రానికి కూడా ఎంతో అండగా దేశానికి నిలబడ్డారు,

 

 

 

 

కార్మికుల కోసం వాళ్లు ఎంతో చేశారు.. మన దేశంలో ఉన్న ఈపీఎఫ్ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రైవేటు ఉద్యోగులు పింఛన్ ఇచ్చే సంస్థ మొట్ట మొదటప్రారంభించారు.. కార్మికుల కోసం, వాళ్ళ బాగు కోసం చేసిన ఒక గొప్ప ఆలోచన.. ప్రపంచమంతా వీళ్ళ విధానాన్నే పాటిస్తుంది.. తరువాత ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం జరిగింది.. కార్మికుల కోసం ఇల్లు కట్టి ఇస్తారు, మెడికల్ సౌకర్యం ఉంటారు ప్రయాణ సౌకర్యాలు ఇస్తార, విహారయాత్రలు సౌకర్యం ఇస్తారు, పిల్లల చదువుల కోసం అండగా ఉంటారు.. ఇలా కార్మికుల సంక్షేమం కోసం ఏ పని చేసిన మొట్టమొదటి పని చేసింది TATA, దేశమంతా, ప్రపంచమంతా అనుసరించారు.

 

 

 

లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి వారసులైన వాటిని గడ్డి పోచగా చూసే మహానుభావులు.. TATA GROUP’S డబ్బుకు విలువ ఇవ్వదు, మానవత్వానికి మనుషులకు మాత్రమే విలువ ఇస్తుంది.. అందుకే ఆ టాటా సంస్థలో పనిచేసే కార్మికులంతా రతన్ టాటా వాళ్ళ కుటుంబం మొత్తం దేవుడిగా కొలుస్తారు.. భారతీయుల టాటా లకు ఎంతో రుణపడి ఉన్నారు.. టాటా ఉత్పత్తులను మాత్రమే కొనండి..ముఖ్యంగా హిందూ బంధువులు టాటాల కు అండగా నిలబడండి వాళ్లు దేశానికి చేసిన సేవ ఎనలేనిది..

 

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: The generosity of the Tatas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page