తిరుచానూరులో రెండో రోజు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

0 23

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.వసంతోత్సవాల్లో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారు ర‌థం బ‌దులు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం జ‌రిగింది. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేద పారాయ‌ణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబు స్వామి, సూప‌రింటెండెంట్  మ‌ధు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: The second day in Thiruchanur is the spring festival of Sri Padmavati Ammavari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page