పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 286

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ప్రైవేటు వైద్యులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు ఇకమీదట రూ.750లకే కరోనా పరీక్షలు నిర్వహించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ వైద్యశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఆసుపత్రులకు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఆర్‌ఎంపిలకు సమాచారం పంపారు. జిల్లా కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ జరపడం జరిగిందన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ల్యాబ్‌లు, ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో కమిషనర్‌ వైద్యులతో, టెక్నిషియన్లతో చర్చలు జరిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేయకుండ మానవతదృక్పదంతో పనిచేయాలని సూచించారు. అలాగే ఆర్‌ఎంపిలు వైద్య పరీక్షలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మెడికల్‌షాపుల్లో వైద్యుల ప్రిస్కిషన్‌ మేరకు మాత్రలు, మందులు విక్రయించాలని పేర్కొన్నారు. నేరుగా విక్రయించిన వారిపై, కరోన పరీక్షలకు అధిక ధరలు వసూలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Corona tests for Rs 750 in Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page