పుంగనూరులో 30న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 157

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో ఈనెల 30న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ బుధవారం తెలిపారు. క రోనా నియంత్రణలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 31 వార్డుల్లోను చెత్తను తరలించి సోడియం హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌, లైమ్‌ పౌడర్‌ను స్ప్రే చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ట్యాంకర్లు, సిబ్బందిని నియమించి, ఈ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.పట్టణ ప్రజలు ఆ సమయంలో ఎవరు బయటకు రావద్దని సూచించారు. నిత్యవసర వస్తువులు కావాల్సిన వారు ముందు రోజే తీసుకోవాలన్నారు. అలాగే పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులు తక్షణమే తమ స్థలాలను శుభ్రం చేసుకోవాలని లేకపోతే వాల్టాచట్టం ప్రకారం స్థలాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Special Sanitation Programs at Punganur on the 30th – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page