పుంగనూరు ల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం కళాశాల-అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 206

పుంగనూరు ముచ్చట్లు:

 

కరువుతో సతమతమౌతున్న పడమటి నియోజకవర్గాలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన, రీసర్చ్ డైరెక్టర్‌ ప్రశాంతి, శాస్త్రవేత్త ఖలీముల్లా, మంత్రి పిఏ మునితుకారాం , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో కలసి కళాశాల ఏర్పాటుకు భవనాలను బైపాస్‌రోడ్డులో పక్కా భవనాలను నిర్మించేందుకు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు అద్దె భవనాలను, 20 ఎకరాల స్థలంలో సుమారు రూ.10 కోట్లలతో పక్కా భవనాలను నిర్మించేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ కళాశాల ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారన్నారు. పుంగనూరులో ముస్లింలు అధికంగా ఉండటంతో వారి కోసం ఉర్ధూకళాశాల మంజూరైందని, స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అలాగే పాడిఆవులకు ప్రసిద్ది కావడంతో ఇక్కడ పశువైద్యకళాశాల కూడ మంజూరైందని తెలిపారు. ప్రజలకు, ప్రాంతాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్న మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపి మిధున్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పుంగనూరు అన్ని రంగాల్లోను అభివృద్ధి పరుగులు తీస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరెడిదడ యాదవ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, ప్రిన్సిపాల్‌ సుబ్రమణ్యం, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, సీఐ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags; College for Agricultural Development in Punganur-Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page