పుంగనూరు ఫీవర్‌ సర్వేలో 232 మంది గుర్తింపు

0 447

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జ్వరాల సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం పదోరౌండు సర్వేను మున్సిపాలిటిలో నిర్వహించారు. 232 మంది జ్వర పీడితులను గుర్తించారు. 31 వార్డుల్లోను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్రతో పాటు కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది , సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వస్తున్నారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, కరోనా లక్షణాలు కలిగిన వారిని కోవిడ్‌ సెంటర్లకు , సాధారణ జ్వర పీడితులకు వైద్య సేవలు అందించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. కాగా పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు జరుగుతుండటంతో కరోనా ప్రభావం తగ్గుతోందని పలువురు అంటున్నారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags; 232 identified in Punganur Fever Survey

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page