బంగాళాఖాతంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశo

0 27

Date:26/05/2021

అమరావతి ముచ్చట్లు :

- Advertisement -

వాయువ్య బంగాళాఖాతంలో యస్‌ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోందని, ఉత్తర ధమ్రా – దక్షిణ బాలాసోర్‌ మధ్య ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో దుగ్గరాజపట్నం(నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని, అలలు 2.5 -5 మీటర్ల ఎత్తులో ఎగసిపడతాయని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నాబాబు పేర్కొన్నారు. తీర, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. మరోవైపు తుపాను అధిక ప్రభావం ఉన్న ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. తుపాను ప్రభావంతో ఝార్ఖండ్‌, బిహార్‌, అసోం, మేఘాలయాలోనూ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags:Chance of a severe cyclone crossing the coast in Bengaluru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page