అనకాపల్లిలో భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రు 57వ వర్ధంతి వేడుకలు

0 27

విశాఖపట్నం ముచ్చట్లు :

 

భారత దేశ మొదటి ప్రధాని “భారత రత్న’ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 57 వ వర్ధంతి నిర్వహించిన అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గురువారం అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ జంక్షన్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూల మాలలు వేసి  కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అనకాపల్లి లోక్ సభ కాంగ్రెస్ పార్టీ పరిశోధన సమన్వయకర్త, అనకాపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బోయిన భాను మూర్తి యాదవ్ మాట్లాడుతూ భారత దేశ రూప శిల్పి పండిట్ నెహ్రూ జీ అని దేశానికి దాదాపుగా 17 సంవత్సరాలు ప్రధానిగా విశిష్ట సేవలు అందించారు.దేశంలో వ్యవసాయం, విద్యుత్తు అభివృద్ధి కోసం జలాశయాలు నిర్మించారు.జలాశయాలను ఆధునిక దేవాలయాలతో నెహ్రూ పోల్చేవారు అని అన్నారు. కశింకోట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మల్లపు రెడ్డి కోటేశ్వర రావు  మాట్లాడుతూ దేశంలో భారీ పరిశ్రమలు, ఎయిమ్స్,ఐఐటీ వంటి సంస్థలను నెహ్రూ నెలకొల్పారు అని అన్నారు. జిల్లా న్యాయ విభాగ అధ్యక్ష్యులు సురా శ్రీనివాస్  మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం దాదాపుగా 3259 రోజులు ఖారాగారం లో ఉన్నారు అని చిన్న పిల్లలను అమితంగా నెహ్రూ ఇష్ట పడే వారు అని అన్నారు. అనకాపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కాళ్ళ సత్యనారాయణ  మాట్లాడుతూ నాడు నెహ్రూ గారు ఆర్థిక పారిశ్రామిక, విద్యా విధానాలలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు వలన నేడు దేశం వివిధ రంగాలలో అభివృద్ధి చెందింది అని అన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: 57th death anniversary of Bharat Ratna Pandit Jawaharlal Nehru at Anakapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page