అభివృద్దికి అమదదూరంలో గ్రామాలు

0 25

పిఠాపురం ముచ్చట్లు :

 

తన హయాంలో కోట్లాది రూపాయలతో పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధిచేసి చూపించానని,వైసీపీ ప్రభుత్వం ఏర్పడి    రెండు సంవత్సరాలైనా గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడదూరంలోనే  ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్.వర్మ అన్నారు.గొల్లప్రోలు మండలం చెందుర్తి,కొడవలి గ్రామాల్లో ఆయన తెలుగుదేశంపార్టీ నాయకులతో కలిసి పర్యటించారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను,కరోనా తీవ్రతను  స్థానికులనడిగి తెలుసుకున్నారు.కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు మెడికల్,పౌష్టికాహార కిట్లను మాజీ ఎమ్మెల్యే వర్మ తన చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్,టీడీపీ మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు,మల్లిపూడి వీరబాబు,నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Villages within walking distance of development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page