అవసరార్ధులకు అండగా భవాని చారిటబుల్ ట్రస్ట్..

0 31

– ఆక్సిజన్ సిలెండర్ల అందచేత కార్యక్రమంలో ఆదిరెడ్డి దంపతులు..

రాజమండ్రి ముచ్చట్లు :

- Advertisement -

కష్టాల్లో ఉన్న వారి అవసరాలను గుర్తించి వారికి సహకారం అందించడమే తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) దంపతులు అన్నారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ రోడ్డులోని హోటల్ జగదీశ్వరి వద్ద రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, ఈఎస్ఐ ఆసుపత్రికి, జమాతే ఇస్లామీ హింద్ వారికి 20 ఆక్సిజన్ సిలెండర్లు అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఈ ఆక్సిజన్ సిలెండర్లు అందించినట్లు వివరించారు. అలాగే తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరఫున ఇప్పటి వరకూ నగరంలో 103 మందికి కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్లను అందించినట్టు తెలిపారు. తాము ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే హెల్ప్ లైన్ కు ఆక్సిజన్ బెడ్స్ కావాలని ఇప్పటి వరకూ 623 మంది ఫోన్ చేయగా 368 మందికి అందించగలిగామని తెలిపారు. అలాగే వెంటిలేటర్ బెడ్స్ కావాలంటూ 116 మంది కోరగా కేవలం 14 మందికి మాత్రమే ఇప్పించగలిగామని తెలిపారు.

 

 

 

 

వెంటిలేటర్స్ కొరగా చాలా తీవ్రంగా ఉందని, వెంటిలేటర్ల కొరత విషయంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని సూచించారు. టోకులైజో మాబ్ ఇంజన్ల కోసం ఆరుగురు సహకారం కోరగా నలుగురి అందించినట్టు తెలిపారు. అలాగే ఈ కరోనా కష్ట కాలంలో సేవ చేస్తున్న జమాతే ఇస్లామీ హింద్ వారి ద్వారా అవసరమైన వారికి తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ 55 ఆక్సిజన్ సిలెండర్లు అందించినట్టు తెలిపారు. అలాగే 108 అంబులెన్సులకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తమ జగదీశ్వరి ఫిల్లింగ్ స్టేషన్ (రిలయన్స్ బంక్) ద్వారా డీజిల్ నింపుతున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ 91 అంబులెన్సు (108) లకు 4465 లీటర్ల డీజిల్ నింపినట్టు వివరించారు. కాగా తాము అడిగిన వెంటనే ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్ల బెడ్స్ ఇచ్చిన ఆసుపత్రుల వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

 

భవిష్యత్తులో కూడా తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున సమాజానికి ఇదే రీతిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కాగా వెంటీలేటర్ల కొరత చాలా తీవ్రంగా ఉన్నందున వాటి కొరత లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది మెడికల్ వారు అధిక ధరలకు మెడికల్ కు సంబంధించిన మెడికల్ సామాగ్రి విక్రయిస్తున్నారని, అది సరైన విధానం కాదన్నారు. ఇక కోవిడ్ కేసులు నియంత్రించడంలో ను, మరణాలు అదుపు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్, రబ్బానీ, అన్సర్, అజ్గర్, ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags; Bhavani Charitable Trust for the needy.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page