ఈటలను కలిసిన కొండా, కొదండరాం

0 20

మేడ్చల్ ముచ్చట్లు :

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం గురువారం ఈటల నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తన చెప్పుచేతల్లో పనిచేయాలని కేసీఆర్ భావించడం తన నియంతృత్వ పోకడకు నిదర్శనమని కోదండ రాం అన్నారు.   రాష్ట్రంలో కోవిడ్ తో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల ఆరోగ్య సమసస్యలు, జూనియర్ డాక్టర్ల, రైతుల సమస్యలపై ముఖ్య మంత్రి దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలపై సంఘటితంగా పోరాటం ఉంటుంది. ఎమ్మెల్యే  ఈటెల రాజేందర్  కుటుంబం సభ్యులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.  రాజకీయ కక్ష్యలకు ఇది సమయం కాదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి  అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Konda, Kodandaram where the yitas meet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page