ఈ నెలాఖరుకు షంగస్ మందు-కేంద్ర మ్ంత్రి కిషన్ రెడ్డి

0 16

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఫంగస్ మందు అంపోటెరిసన్  ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మన దేశ కంపెనీలు పదకొండు ఈ  అంపోటెరిసన్  ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా  ఫంగస్ మందు అందుతుంది. వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి. నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి. జూడాల కోరికలు న్యాయమైనవేనని అయన అన్నారు. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి. కరోన తగ్గిన దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఫంగస్  వస్తుంది,వారిని ఇంట్లోనే పెట్టుకొని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలి. దేశంలో ఆక్సిజన్ ,బెడ్స్ కొరత లేదు. వాక్సిన్,ఇంజక్షన్స్ ఆసుపత్రులు,ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోవచ్చు,24 గంటల్లో కేంద్రం ఆమోదం ఇస్తుంది. మీడియా కూడా ప్రజలను బయపెట్టకుండా కోవిడ్ జయించిన వారి కధనాలు ప్రసారం చేయాలి. 125 బెడ్ల సామర్థ్యం ఉన్న ఈఎన్టీ 250 మందికి పైగా వైద్యం అందిస్తుందని అయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Kishan Reddy, Union Minister for Drugs, Shangdu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page