ఉపాధి హామీ మహిళలతో కలెక్ట్ మాటామంతి

0 33

అనంతపురం ముచ్చట్లు :

 

జాబ్ కార్డుతో ఉపాధి పొందుతున్న మహిళలతో అనంతపురం జిల్లా కలెక్టర్ గందం చంద్రుడు మమేకమ య్యారు. 2006 సంవత్సరంలో దేశంలోనే మొట్టమొదటి ఉపాధి హామీ జాబ్ కార్డును ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్న పెద్దక్క అనే మహిళతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట కలిపారు. పదిహేనేళ్ల ఉపాధి హామీ పథకం ఆమెకు ఎలా ఉపయోగపడింది అని జిల్లా కలెక్టర్ వాకబు చేశారు.నార్పల మండలంలోని బండ్లపల్లె గ్రామంలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో ఉన్న కలెక్టర్ మొట్టమొదటి జాబ్ కార్డు గ్రహీతను పలకరించా రు.ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీ ధరలు పెరిగాయని, పని దొరకదనే అభద్రతా భావం తొలగిపోయిందని పెద్దక్క తెలిపారు. ఇద్దరు కొడుకులను చదివించుకుని, పెళ్లిళ్లు చేయగలిగానన్నారు. ప్రభుత్వం అందించే ఇతర పథకాల ద్వారా కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నానని, అప్పులు తీర్చేసుకుని ప్రస్తుతం పొదుపు కూడా చేయగలుగుతున్నానన్నారు. తను పొదుపు చేసుకున్న సొమ్ముతో మనవళ్లకు, మనవరాళ్లకు తన గుర్తుగా ఏదైనా అందిస్తానన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Employment Guarantee Collected Conversation with Women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page