కరోనాతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం పంపిణీ

0 32

పెద్దపల్లి ముచ్చట్లు :

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీల్లో కరోనా బారినపడి వండుకోలేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబాలకు గత కొన్ని రోజులుగా బోజనాలను అందిస్తున్న మడిపెల్లి మల్లేష్ సేవలను చూసి చలించిపోయిన దొమ్మేటి వాసు పది కిలోల చికెన్ ను గురువారం సామాజిక కార్యకర్త
మడిపెల్లి మల్లేష్ కు అందజేశారు.ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో అనేక సందర్భాలలో సహాయాలు చేస్తున్నటువంటి మనసున్న మహారాజులు చాలా మంది ఉన్నారనీ, కరోనా మహమ్మారి వలన మన ఊర్లో ఉన్న నిరుపేదలు కరోనా వైరస్ సోకి వారిని, వారి కుటుంబాలను అతులకుతలం చేస్తున్నదన్నారు. ఈ సమయంలో మనందరం కలిసి మన ప్రాంతంలో ఉన్న నిరుపేదలను కాపాడుకోవాలని, మిత్ర పౌల్ట్రీ సప్లయ్ ప్రోప్రైటర్ దొమ్మేటి వాసుని ఆదర్శంగా తీసుకొని మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చి మీవంతు సహాయాన్ని అందించాలని మల్లేష్ కోరారు. చికెన్ ను ఎల్కలపెల్లి గెట్ హోటల్ శంకర్ రుచికరంగా వండి ప్యాకింగ్ చేసి మాకు ఉచితంగా అందజేశారు. మిత్ర పౌల్ట్రీ సప్లయ్ ప్రోప్రైటర్ దొమ్మేటి వాసు, కన్నూరి శంకర్ (హోటల్ శెంకరన్న)కు పెసెంట్స్ కుటుంబల తరఫున వారి టీం సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో మణి, బండి అనిల్, వినయ్, కన్నూరి చరణ్, అరగొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Distribution of nutritious food to those suffering from corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page