కోటా బియ్యం స్వాధీనం

0 11

విశాఖపట్నం ముచ్చట్లు :

విశాఖ ఎలమంచిలి మండలం తెరువుపల్లి లో శ్రీ సత్యనారాయణ  ట్రేడర్స్ రైస్ మిల్లు లో  కోటా బియ్యం కుంభకోణం బయటపడింది. ఈ రోజు ఎలమంచిలి పోలీసులు కి వచ్చిన పక్కా సమాచారం తో పోలీసులు వెళ్లి మిల్లు వద్ద చూడగా అప్పటికే ఒక లారీలో సుమారు 400 బస్తాలు బియ్యం లోడు చేసి ఉండగా పోలీసులు తనిఖీలు చేసి లారీ ని అదుపులోకి తీసుకొని సంబంధిత సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు సరిగా స్పందించక పోవడంతో పోలీసులు లారీ ని యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేస్తామని రూరల్ యెస్ ఐ చంద్రశేఖర్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు  ఇప్పటి కైనా స్పందించి ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి మాఫియాలు తయారవకుండా ఉంటాయని స్థానికుల అభిప్రాయం. రైస్ మిల్లు యజమాని పై ఇదివరకు కూడా చాలా సార్లు పట్టుబడిన చట్టంలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల సులువుగా బయటకు వచ్చి మరలా అదే దందా చేస్తున్నట్లు సమాచారం.ఇలాంటి వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇతని పై స్థానిక పోలీసులే కాకుండా విజిలెన్స్ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.ఇతను మండలంలో గల ప్రజాపంపిణీ వ్యవస్థ డీలర్ల వద్ద పి డి యెస్ బియ్యాన్ని  పెద్ద మొత్తంలో కొని కాకినాడ ,వైజాగ్ పోర్టులు ద్వారా అక్రమంగా రవాణా చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Acquisition of quota rice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page