క‌రోనాతో ఏపి సచివాలయం మరో ఉద్యోగి మృతి

0 19

అమరావతి ముచ్చట్లు :

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సచివాలయాన్ని క‌రోనా వ‌ణికిస్తున్న‌ది. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మ‌ర‌ణిస్తున్న సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, తాజాగా మరో ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు. మున్సిపల్ శాఖలో ఏఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్న బీ.శంకరప్ప కరోనా వ‌ల్ల చ‌నిపోయారు. వైరస్ బారిన ప‌డిన ఆయ‌న ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉద‌యం మ‌ర‌ణించారు.స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న 40 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సెక్ర‌టేరియ‌ట్‌లో విధుల‌కు హాజ‌రుకావాలంటే ఉద్యోగులు భ‌య‌ప‌డుతున్నారు. ఈనేప‌థ్యంలో త‌మ‌కు ఇంటి వ‌ద్ద నుంచి ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Another employee of the AP Secretariat with Corona died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page