గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు -టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి

0 28

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పూర్తయ్యే ప్రాంతంలో జరుగుతున్న పనులను టిటిడి చైర్మన్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించడం వల్ల వాహనాల్లో వెళ్లేవారు నేరుగా టోల్ గేట్ ద్వారా, నడచి వెళ్లేవారు అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫ్లైఓవర్ పొడిగించేందుకు అయ్యే వ్యయం తదితర విషయాలను రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.టిటిడి చైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్  రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Plans to extend Garudavaradhi flyover to Alipiri – TTD Board of Trustees Chairman YV Subbareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page