చంద్రుడు.. సూర్యుడైన వేళ..!

0 24

వెల్లింగ్టన్‌ ముచ్చట్లు :

 

చంద్రగ్రహణం, బ్లడ్‌మూన్‌, సూపర్‌ మూన్‌.. ఒకే రోజులో వస్తే దాన్ని ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ అంటారు. బుధవారం ఆ అరుదైన మూడు ఖగోళ అద్భుతాలు నింగిలో చోటు చేసుకున్నాయి. అస్తమిస్తున్న సూర్యుడిని తలపించిన చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో వెలుగులీనాడు. ఈ ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు, ప్రజలు వీక్షించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా, ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది. ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ను మరింత దగ్గరగా చూసేందుకు ఆస్ట్రేలియాలో కొందరు ప్రత్యేక విమానం వేసుకొని మరీ ఆకాశంలో విహరించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వాతావరణంలో పెద్దగా మార్పులు లేకపోవడం ‘సూపర్‌ బ్లడ్‌మూన్‌’ను చూడడానికి ఇబ్బందులు కలగలేదు. దక్షిణ కొరియా, జపాన్‌ వాసులకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: When the moon .. the sun ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page