పన్నీరు ఇంకా అసంతృప్తే

0 19

చెన్నై ముచ్చట్లు:

 

జయలలిత జీవించి ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. జయలలితకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పన్నీర్ సెల్వంకు పేరుంది. అయితే జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వంను తప్పించడం, పళినిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం చకా చకా జరిగిపోయాయి. అయితే అప్పుడు కూడా పన్నీర్ సెల్వం వెంట శానససభ్యులు పెద్దగా లేకపోవడంతో ఆయన పళనిస్వామితో రాజీ పడాల్సి వచ్చింది. రాజీ ఫార్ములాతో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.పళనిస్వామి ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్లు బాగానే పనిచేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక నుంచి పొత్తుల వరకూ అంతా ఆయన కనుసన్నల్లోనే నడిచింది. పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. దీంతో పాటు ప్రచారాన్ని కూడా పళనిస్వామి తన భుజాలపై వేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. పన్నీర్ సెల్వం కొన్ని నియోజకవర్గాలకే ప్రచారానికి పరిమితమయ్యారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలయినా గౌరవ ప్రదమైన సీట్లు దక్కించుకుంది.

 

 

 

- Advertisement -

65 స్థానాల్లో గెలిచి పళనిస్వామి నాయకత్వ పటిమను చాటుకున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా తనకు కావాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఈ ఐదేళ్లు తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ పళినస్వామి మాత్రం అందుకు అంగీకరించలేదు.
ఎమ్మెల్యేలందరూ పళనిస్వామికే మద్దతు పలికారు. 65 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది పళనిస్వామి ప్రతిపక్ష నేతగా కొనసాగాలని కోరారు. దీంతో పన్నీర్ సెల్వం ఆశలు అడియాశలయ్యాయి. ఆయన అసంతృప్తితో రగలిపోతున్నారు. తనకు జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో అంతా అన్యాయమే జరుగుతుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో పళనిస్వామికి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:If the rose water is still unsatisfied

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page