పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

0 298

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలో కరోనా మరణాలను నివారించేందుకే ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక కోవిడ్‌ వైద్యసేవలు ఏర్పాటు చేసినట్లు తిరుపతి బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. గురువారం మంత్రి పిఏ మునితుకారం , వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎంఆర్‌సి.రెడ్డి, రుయా ఆసుపత్రి కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుబ్బారావు , నారాయణాద్రి ఆసుపత్రి ఎండి స్రునందకుమార్‌రెడ్డితో కలసి క్వారంటైన్‌ సెంటర్‌ను, కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించి, డాక్టర్లకు తగిన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పుంగనూరు, సదుం ఆసుపత్రులను, సెంటర్లను పరిశీలించామన్నారు. పుంగనూరు ప్రభుత్వాసుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చి, 80 ఆక్సిజన్‌ బెడ్లు, 6 వెంటిలేటర్లను, 150 ఆక్సిజన్‌ సిలిండర్లను, 50 ఆక్సిజన్‌ కాన్స్ట్రేటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. సుమారు రూ.2కోట్లతో మంత్రి పెద్దిరెడ్డి ఆధునిక పరికరాలను ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. అవసరమైన మందులు, సలహాలు, సూచనలను డాక్టర్ల బృందానికి ఎప్పటికప్పుడు అందిస్తుంటామన్నారు. అలాగే ప్రతి వారము పుంగనూరుకు వచ్చి ప్రజలకు ఆధునిక వైద్యం అందిస్తామన్నారు. ఎంఆర్‌సి.రెడ్డి మాట్లాడుతూ మంత్రి తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత నిధులు ఖర్చు చేసి, అధునాతన వసతులు కల్పించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఆధునాతన పరికరాలతో భవిష్యత్తులో అనేక జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందించడం సులభతరమౌతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందకుండ నిర్భయంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా రోగులను ఆదుకునేందుకు పెద్దిరెడ్డి కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీరి వెంట స్థానిక డాక్టర్లు రెడ్డికార్తీక్‌, బర్కతున్నిసా, అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Modern medicine to control corona deaths in Punganur – Bird Specialist Reddeppareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page