ప్రతిరోజు  15 మంది నిరుపేద వృద్ధులకు అన్నం పెట్టి నా రుణం తీర్చుకుంటా

0 61

గూడూరు ముచ్చట్లు :

నెల్లూరు జిల్లా, రాపూరు మండలం జి. ఎన్ పాలెం గ్రామానికి చెంది, ప్రస్తుతం గూడూరు పట్టణం గాంధీనగర్లో స్థిర నివాసం ఉంటున్న ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు, ప్రజా కవి, గాయకులు  వేగూరు విజయ్ కుమార్, తాను పుట్టిన గ్రామానికి తన నైతిక బాధ్యతగా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే నిశ్చయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా,ఈనెల 19వ తేదీన తన కుమారుడు చిరంజీవి వేగూరు విజయ్ రాజ్ పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కేత అనిల్ కుమార్ రెడ్డి  ముఖ్యఅతిథిగా, తన స్వగ్రామమైన రాపూరు మండలం, జి.ఎన్.పాలెం లోని 15 మంది వృద్ధులు మరియు నిరు పేదలకు నిరంతరం ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట భోజన ఏర్పాట్ల కు శ్రీకారం చుట్టారు. పై కార్యక్రమాల్లో వేగూరు విజయ్ కుమార్ తో పాటు, మేక రమణరావు, వేగూరు పద్మ, చిరంజీవి వేగూరు విజయరాజ్ నిరుపేద వృద్ధులు ప్రజలు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Every day I pay my debt by giving rice to 15 poor old people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page