ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదుసమ్మె కొనసాగిస్తాం- జూడాలు

0 21

హైదరాబాద్ ముచ్చట్లు:

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్  (డీఎంఈ) రమేశ్ రెడ్డితో జూనియర్ వైద్యుల (జూడాలు)  గురువారం చర్చలు జరిపారు. అవి అసంపూర్ణంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది.  తరువాత జూడాలు మీడియాతో మాట్లాడారు.   ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని  తెలిపారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వ హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టంచేశారు. ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు. విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు.‘‘కొవిడ్ మృతులకు పరిహారం ఇవ్వబోమని డీఎంఈ చెప్పారు. కొవిడ్ సోకిన వైద్య సిబ్బందికి గాంధీ ఆసుపత్రిలో బెడ్లు ఇచ్చే అంశం లేదన్నారు. పది శాతం కొవిడ్ ఇన్సెంటివ్లు ఇవ్వడం కుడా  కుదరదని తెలిపారు. ఈ ఏడాది జనవరి లేదా మే నెల నుంచి 15శాతం హైక్ ఇస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చూసి సమ్మె విరమించాలని అనుకున్నాం. కానీ.. డీఎంఈతో చర్చల్లో మాకు సరైన హామీ రాలేదు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరాలా? వద్దా? అనే అశంపై తాము చర్చించుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతానికి మా సమ్మె కొనసాగిస్తున్నామని జూడాలు స్పష్టం చేసారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: We will continue the strike without proper assurance from the government- Judas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page