ప్లాస్మాను దానం చేసి మహిళ ప్రాణాలను కాపాడిన యువకులు

0 20

కోరుట్ల ముచ్చట్లు :

 

కరోనా తో పోరాడుతూ అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే ప్లాస్మాను దానం చేసి ఓ మహిళ ప్రాణాలను కాపాడినఇద్దరూ యువకులు. కోరుట్ల ప్రెస్ క్లబ్, చేయూత స్వచ్చంధ సేవా సంస్థ, మరియు కోరుట్ల యువజన సంఘాల సమితి సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న కోరుట్ల ప్లాస్మా డోనార్స్ గ్రూప్ లో సభ్యులైన కోరుట్ల పట్టణానికి చెందిన గూరూడు మహేష్ , చిన్న మెటుపెల్లి గ్రామానికి చెందిన బండి సంజయ్ గౌడ్ లు పట్టణానికి చెందిన ఓ మహిళకు రెండు యూనిట్లు ఓ పాజిటివ్  ప్లాస్మా అత్యవసరమవగా కోరుట్ల ప్లాస్మా డోనార్స్ గ్రూప్ నిర్వాహకుల ద్వారా సమాచారం మేరకు కరీంనగర్ వెళ్లి ప్లాస్మాను దానం చేశారు.ఈ సందర్భంగా కోరుట్ల ప్లాస్మా డోనార్స్ గ్రూప్ నిర్వాహకులు, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్ర శేఖర్, చేయూత స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కటుకం గణేష్, చేయూత స్వచ్చంధ సేవా సంస్థ అధ్యక్షులు వాసాల గణేష్, యువజన నాయకులు ఎండి సనావొద్దిన్, ఎండి అతీక్, జాల వినోద్ కుమార్, పంచిరి విజయ్ కుమార్ లు ప్లాస్మా దాతలను అభినందించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Young men who donated plasma and saved a woman’s life

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page