బజారులో నకిలీ అనందయ్య మందు

0 32

పోలీసుల అదుపులో వ్యక్తి

నెల్లూరు ముచ్చట్లు :

- Advertisement -

ఆనందయ్య ఆయుర్వేదం మందు పేరుతో గ్రామాల్లో నకిలీ మందు పంపిణీ జరుగుతోంది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవి పూడి గ్రామంలో కుమ్మరి పాలానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కరోనా మందు పంపిణీ చేస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డిఎస్పీ హరినాధ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు పేరుతో ఎవ్వరు మందును కొనుగోలు చేయవద్దని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.  నకిలీ ఆయుర్వేదం మందుని తయారుచేసి అమ్మ కూడదని, ఎవరికి ఉచితంగా పంపిణీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి ఉన్నవారు మాత్రమే ఆయుర్వేదం ఔషధాలను తయారు చేయాలని… నకిలీ ఆయుర్వేదం మందులు తయారీదారుల పై పోలీసుల నిఘా ఉంటుందని తెలియజేశారు. త్వరలో ఆనందయ్య ఆయుర్వేదం మందు కు ప్రభుత్వ అనుమతులు వస్తాయని వచ్చిన వెంటనే పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Fake anandayya drug in the market

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page