మండే ఎండల్లో మొక్కలకు రక్షణ

0 18

హైద్రాబాద్ ముచ్చట్లు :

 

ఓవైపు కరోనా.. మరోవైపు 42 డిగ్రీలు దాటిన ఎండలు..ఈ సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ‘హరిత’ స్ఫూర్తిని చాటుతున్నారు హెచ్‌ఎండీఏ అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం సిబ్బంది. రాజధాని మణిహారమైన 158 కిలోమీటర్ల మేర ఔటర్‌లో ప్రతిమొక్కను బతికించుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. పచ్చదనం పెంపు, సంరక్షణపై లాక్‌డౌన్‌ ప్రభావం ఏ మాత్రం పడకుండా పక్కా కార్యాచరణ ప్రణాళికతో వెళుతున్నారు. పోలీస్‌శాఖ నుంచి కూలీల వరకు నిత్యం సమన్వయం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. ఔటర్‌తో పాటు రాజీవ్ రహదారి, నర్సరీల్లో మొక్కల పెంపకం, అర్బన్‌ఫారెస్ట్రీబ్లాకుల అభివృద్ధిలో క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  16 అర్బన్‌ ఫారెస్ట్‌బ్లాక్‌లను హెచ్‌ఎండీఏ అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం అభివృద్ధి చేస్తున్నది.  రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ల సహకారంతో 136 వాటర్‌ ట్యాంకర్లను సమకూర్చుకుని నిత్యం మొక్కలకు నీళ్లు పడుతున్నారు. అదే విధంగా సర్వీస్‌ రోడ్ల వెంబడి ఉన్న ప్లాంటేషన్‌, రైల్వే కారిడార్‌, ఓపెన్‌ స్పేస్‌లో ఉన్న మొక్కలకు నీళ్లు అందిస్తూ వేసవిలో మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 

 

- Advertisement -

ఎండ తీవ్రతతో మొక్కలు ఎండిపోకుండా పోషకాలు అందించేందుకు వివిధ రకాల మిశ్రమాన్ని అందిస్తున్నారు. లీటర్‌నీటిలో పల్చటి జీవామృతం, కాఫర్‌, మెగ్నీషియం సల్ఫెట్‌ పది మిల్లీ లీటర్లు, ఫార్మల్డీ హెల్ద్‌ ఐదు మిల్లీ లీటర్లు, క్యూమిక్‌ యాసిడ్‌ను మోతాదులో కలిపి, ఒక మొక్కకు ఒక లీటర్‌ చొప్పున ఈ మిశ్రమాన్ని అందిస్తున్నారు. సెంట్రల్‌ మీడియన్‌లో ఉన్న మొక్కలకు రోజు విడిచి రోజు, ఎడ్జ్‌లో ఉన్న మొక్కలకు నెలలో 28 రోజులు, పెద్ద మొక్కలకు రెండు రోజులకోసారి సమృద్ధ్దిగా నీరందిస్తున్నారు.పచ్చదనం పెంపు, సంరక్షణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఔటర్‌తో పాటు నర్సరీల్లో ఉన్న మొక్కలకు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తున్నాం. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌లతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మొ క్కలు ఎండిపోకుండా ఎండకు నిలబడేందుకు పోషకాల మిశ్రమాన్ని అందిస్తున్నామని డీఎఫ్ఓ ప్రకాష్ తెలిపారు.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Protection for plants in burning ends

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page