మందమల్లమ్మ చౌరస్తా  పోస్ట్ ను పరిశీలించిన రాచకొండ సీపీ

0 36

రంగారెడ్డి ముచ్చట్లు :

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా లోని చెక్ పోస్ట్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేసారు. పాసులు లేకుండా,పరిమిషన్ లేని వ్యక్తులు బయట తిరగడం చాలా వరకు తగ్గిపోయింది అని అన్నారు. చెక్ పోస్టుల వద్ద గ్రీన్ ఛానల్స్ కోసం అంబులెన్సులు, డాక్టర్స్  ప్రత్యేక లైన్ లో వాహనాలు వెళ్లేటందుకు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు తెలుసుకొని ప్రజల రూల్స్ పాటిస్తున్నారని సీపీ అన్నారు.  ప్రజలు కరో నిబంధనలు పాటించడం ద్వారా కరోనా పాజిటివ్ రేట్ తగ్గుతుందని అన్నారు. ఉదయం లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలు గుంపులు గా ఉండకుండా భౌతిక దూరం  పాటించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రజలు మాస్కూల్ సరైన పద్ధతులు ధరించడం లేదని అలాంటి వారి పై వెయ్యి రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుందని అన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్, బిస్కెట్స్ ,స్నాక్స్ ను సి పి పంపిణీ  చేయడం జరిగింది.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Rachakonda CP examining Mandamallamma Chowrasta post

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page