లక్షణాలుంటే వెంటనే కరోనా పరీక్షలు

0 34

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని , కరోనా బారిన పడి తీవ్రత ఎక్కువయ్యాక ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు.గురువారం మండలంలోని పెద్దకొండామర్రి, వెంగళపల్లె, దిగువపల్లె, కాటిపేరి, కాగతి తదితర గ్రామ పంచాయతీలలో ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌ తో కలిసి పర్యటించారు. పెద్దకొండామర్రి, కాటిపేరి, గడ్డంవారిపల్లెలో 45 సంవత్సరాల వయస్సు పైబడినవారికి తొలి డోసు వ్యాక్సినేషన్‌ ప్రకియను ప్రారంభించారు. అలాగే పాజిటీవ్‌ కేసులు అధికంగా ఉన్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. మండలానికి 1500 డోసులు అంద గా తొలిరోజు 752 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు డాక్టర్‌ పవన్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఆయా పంచాయతీ సర్పంచ్‌లు జయస్రుధమ్మ,సరితారెడ్డి, భాగ్యవతిలు సౌకర్యాలు కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రుకుమార్‌రెడ్డి, జాకీర్‌హుస్సేన్‌, మీనా ఏఎన్‌ఎంలు సుగుణ, మీన తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Symptoms include immediate corona tests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page