సింహాద్రి, చెవిరెడ్డిపై అటెన్షన్

0 32

విజయవాడ ముచ్చట్లు :

ప్రస్తుతం క‌రోనా తీవ్రత రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రతిరోజూ వేలాది కేసులు న‌మోదవుతున్నాయి. ప‌దుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఒక‌వైపు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సేవ‌లు అంద‌క‌.. ప్రజ‌లు ఇక్కట్లు ప‌డుతున్నార‌నేది వాస్తవం. దీంతో ప్రతిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శలు సైతం వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో 150 మంది (జ‌గ‌న్ మిన‌హా) ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండ‌డంతో నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.కొంద‌రు క‌రోనా బారిన ప‌డిన ప్రజ‌ల‌కు సొంతంగా వైద్య సేవ‌లు అందించేం దుకు కృషి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కూడా వీరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావ‌న రావ‌డం.. వారి గురించి ప్రత్యేకంగా వార్తలు రాయ‌డం క‌నిపిస్తోంది. వీరిలో కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజక వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన సింహాద్రి ర‌మేష్ బాబు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న చెవిరెడ్డి భాస్కర‌రెడ్డిల గురించి.. ప్రత్యేకంగా ప్రస్తావ‌న వ‌స్తోంది.సింహాద్రి ర‌మేష్‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వంద ప‌డ‌క‌ల‌తో ప్రత్యేకంగా ఆసుప‌త్రిని నిర్మించారు. అదే స‌మ‌యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాన్ని సైతం మానిట‌రింగ్ చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. క‌రోనా బాధితులు కోలుకునేలా చేస్తున్నారు. ఇక‌, చెవిరెడ్డి కూడా ప్రత్యేకంగా కొన్ని క‌ళ్యాణ మండ‌పాలను ద‌త్తత తీసుకుని.. కోవిడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నారు. ఇద్దరూ కూడా ప‌నులు లేకుండా పోయిన నేప‌థ్యంలో పేద‌ల‌కు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. కొంద‌రికి రూ.1000 చొప్పున ర‌మేష్‌బాబు అందిస్తున్నారు. దీంతో అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వర్గంలో ఎమ్మెల్యే పేరు మార్మోగుతోంది.చెవిరెడ్డి గ‌తేడాది లాక్‌డౌన్ నుంచే చంద్రగరిలో సొంతంగా అనేక కార్యక్ర‌మాలు చేస్తున్నారు. ఇక‌, వీరి విష‌యం సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు చేరింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల‌కు కూడా ఆయ‌న ఫోన్ చేసి అభినందించార‌ని.. మ‌రిన్ని సేవ‌లు అందించాల‌ని ప్రోత్సహించిన‌ట్టు వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మిగిలిన ఎమ్మెల్యేలు వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతారో లేదో చూడాలి.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Attention on Simhadri, Chevireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page