అణగారిన వర్గాల కోసం పాటుపడ్డ వ్యక్తి ముద్దం ప్రకాష్

0 25

-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

 

జగిత్యాల  ముచ్చట్లు :

 

- Advertisement -

పంచాయతీరాజ్ ఇంజనీర్ ముద్దం ప్రకాష్ మరణం అత్యంత బాధాకరమని, వ్యక్తిగతంగా తనతో పాటు జిల్లా వాసులకు తీరని లోటు అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ అన్నారు. శుక్రవారంనాడు ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఉద్యోగిగా ఆయన సేవలు మరువలేనివని, నిత్యం అభివృద్ధికై పాటుపడే వ్యక్తి ముద్దం ప్రకాష్ అని అన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని, స్నేహశీలి, మృదుస్వభావి అన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్, ఎస్సీ ఎస్టీ సెల్ సభ్యుడిగా ఆయన ఎన్నో సేవలు చేశారని అణగారిన వర్గాల అభివృద్ధికై పాటుపడ్డ వ్యక్తి అన్నారు. కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్న సమయంలో తాను మనోధైర్యం ఇచ్చానని, ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడానని, చివరికి ఆయనపై కరోనానే విజయం సాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే అన్నారు.

ముద్దం ప్రకాష్ కు ఎమ్మెస్సీ ఘన నివాళులు

జగిత్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ ప్రకాష్ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాసంలో ప్రకాశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేశారు.ఎమ్మెల్సీ తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్,  కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు వున్నారు.

ముద్దం ప్రకాష్ కు జువ్వాడి సోదరులు సంతాపం

ముద్దం ప్రకాష్ మృతి జువ్వాడి నర్సింగరావు కృష్ణారావు సోదరులకు దిగ్బ్రాంతి కలిగించిందని వారు ఆన్నారు.పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎక్జ్స్ క్యూటివ్ ఇంజనీర్ జగిత్యాలకు చెందిన ముద్దం ప్రకాష్  గురువారం ఆనారోగ్యంతో అకాల మరణం చెందడం పట్ల కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశారు.శుక్రవారం ఈమేరకు వారు ఒక సంతాప సందేశాన్ని విడుదల చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ సంఘం జాతీయ కమిటీ సభ్యుడిగా అట్రాసిటీ కమిటీ మానిటరింగ్ సభ్యుడిగా ఎంతో సేవ చేశారని, ముఖ్యంగా దళితుల అభివృద్ధికి విశేష కృషి చేేసిన ప్రకాష్ అకాల మరణం తమను దిగ్బ్రాంతికి గురి చేసిందని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు తగిన మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుకొంటున్నట్లు నర్సింగరావు, కృష్ణారావులు  పేర్కొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Muddam Prakash is a man who stood up for the downtrodden

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page