ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : ఎల్.రమణ

0 13

హైదరాబాద్ ముచ్చట్లు :
తెలుగుజాతికి ఇవాళ పర్వదినమని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టి ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభ చూపారని కొనియడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. కొందరికే పరిమితమైన అధికారాన్ని సామాన్యుల వద్దకు తీసుకువచ్చారన్నారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ఇవాళ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని రమణ అన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

- Advertisement -

Tags:Bharat Ratna should be given to NTR: L. Ramana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page