ఎన్టీఆర్ జీవితం భావి తరాలకు ఆదర్శం: చంద్రబాబు

0 7

హైదరాబాద్ ముచ్చట్లు :
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు రాజీపడకుండా పోరాడే వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పక్క గృహాలను, గురుకుల పాఠశాలలను పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి వారసత్వ సంపద, రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శమన్నారు. దేవుడిని ఎన్టీఆర్‌లో చూసుకున్న రోజులున్నాయని, దేవుడి పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడన్నారు. ఆచరణ సాధ్యం‌ కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ , దేవాన్ష్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

- Advertisement -

Tags:NTR life is an ideal for future generations: Chandrababu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page