కొవిడ్ ఆరిజన్ పై విచారణ షురూ

0 27

న్యూయార్క్ ముచ్చట్లు :

 

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ల్యాబ్ నుంచి పుట్టిందా? సహజసిద్ధమైందా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. దీని మూలాలపై డబ్ల్యూహెచ్ఓ స్వతంత్ర దర్యాప్తు తొలి దశ పూర్తయినా ఓ నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ మూలాలపై అమెరికా నిఘా వర్గాలకు అధ్యక్షుడుజో బైడెన్ కీలక ఆదేశాలు జారీచేశారు. చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చిందా? ల్యాబ్‌లో ప్రమాదవశాత్తు లీకయ్యిందా? అనేది మూడు నెలల్లోగా నివేదిక అందజేయాలని బైడెన్ ఆదేశించారు.కోవిడ్-19 గురించి ఒక ఖచ్చితమైన నిర్ధారణకు దగ్గర చేసే సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయండి.. దీనికి సంబంధించిన నివేదికను 90 రోజుల్లో అందజేయాలి’’ అని బైడెన్ ఆదేశించినట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

 

 

 

 

- Advertisement -

ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ మూలాలపై దర్యాప్తు సంస్థలు రెండుగా విడిపోయాయని బైడెన్ వ్యాఖ్యానించారు.చైనాలోని వుహాన్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ద్వారా లేదా అదే నగరంలోని అత్యంత సురక్షితమైన వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి కరోనా వైరస్ ప్రమాదవశాత్తు లీకకావడం ద్వారా ఉద్భవించిందనే దానిపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్ ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మహమ్మారికి వ్యాప్తికి చైనాయే కారణమని, ల్యాబ్ థియరీని రిపబ్లికన్లు ఉపయోగించడంతో డ్రాగన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది.కోవిడ్ మూలాలపై నివేదికను మార్చిలోనే కోరినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించిందా? ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు లీకయ్యిందా అనేది పూర్తిస్థాయి వివరాలు అందజేయాలని సూచించారు. ‘‘కరోనా పుట్టుపూర్వోత్తరాలపై అమెరికా నిఘా సంస్థ రెండుగా విడిపోయింది కానీ, ఈ రోజు వరకూ నిర్ధారణకు రాలేకపోయింది’’ అని బైడెన్ అన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Inquiry into Kovid Origin begins

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page