ట్రాన్స్ జెండర్ల అకౌంట్ లోకి 1500

0 33

న్యూఢిల్లీ ముచ్చట్లు :
కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కరోనా కష్టకాలంలో ఇది వారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరుతూ కాల్స్, ఈమెయిల్స్ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు ప్రాథమిక అవసరాల కోసం తక్షణ సహాయంగా రూ.1,500 జీవనాధార భత్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సహాయం ట్రాన్స్‌జెండర్ సమాజానికి రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు (సీబీఓ) ఈ ఆర్థిక సాయం గురించి ట్రాన్స్‌జెండర్లలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది లాక్ డౌన్‌లో కూడా ఇలానే ఆర్థిక సాయం చేసింది. రేషన్ కిట్లను అందించింది.ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందించాలి. ట్రాన్స్‌జెండర్లు ఈ లింక్‌పై క్లిక్ చేసి డబ్బుల కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.1500 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మే 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

- Advertisement -

Tags:1500 into the account of transgender people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page