తెలంగాణలోనూ… ఆనందయ్య

0 34

మంచిర్యాల ముచ్చట్లు :

 

కరోనాకు నాటు మందు అంటూ ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య అనే వ్యక్తి ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో మరికొందరు కూడా తాము కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టామంటూ ముందుకు వస్తున్నారు. ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు పంచిపెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి మందునే సింగరేణికి చెందిన ఓ విశ్రాంత కార్మికుడు ఇవ్వడం మొదలు పెట్టాడు.మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి దీన్ని మొదలు పెట్టాడు.ఈ బచ్చలి భీమయ్య కరోనా రోగానికి నాటుమందు ఇస్తున్నాడని తెలియడంతో జనం తాకిడి నెమ్మదిగా మొదలైంది. అయితే, ఈయన ముందు తరాల వారు కూడా ఆయుర్వేద మందులు తయారు చేసి జనాలకు అమ్మేవారు. వైద్యం కూడా చేసేవారు. వారి నేర్చుకున్న భీమయ్య కరోనాకు మందు తయారు చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే, భీమయ్య కూడా ఆనందయ్య లాగా ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.దీంతో ఆనందయ్య లాగే భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంగతి తెలుసుకున్న మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ భీమయ్యను ప్రశ్నించారు. మందు ఇవ్వొద్దని ఆదేశించినట్లు సమాచారం. జనాలకు కూడా ఇలాంటి మందు తీసుకొని ప్రమాదంలో పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: In Telangana too … Anandayya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page