నిబంధనలకు విరుద్ధంగా బయట తిరుగుతున్న 1408 వాహనాలు సీజ్

0 27

-జిల్లా ఎస్పి శ్వేతారెడ్డి

కామారెడ్డి  ముచ్చట్లు :

- Advertisement -

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి బుధవారం ఒకే రోజున జిల్లావ్యాప్తంగా 246 (1408) వాహనాలను సీజ్ చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి   పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపార సంస్థలపై 4 (255) కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 333 (4603) మంది నిబంధనలు పాటించక పోవడం వలన జరిమానాలు విధించడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అడిషనల్ ఎస్ పి అన్యోన్య ఎప్పటికప్పుడు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లాక్ డౌన్ అమలవుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇస్తున్నారు. బాన్సువాడ లో డిఎస్పి జైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డిలో డీఎస్పీ శశాంక్ రెడ్డి, కామారెడ్డిలో డీఎస్పీ ఎం. సోమనాథం వారి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో లాక్డౌన్ పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని, ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:1408 vehicles roaming outside illegally were seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page