పరవాడ పోలీస్ స్టేషన్ కు మాస్కులు, శానిటైజర్ లు అందజేత

0 8

విశాఖపట్నం ముచ్చట్లు :

 

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంట్లో భాగంగానే కరోనా నిర్మూలనకు లాక్ డౌన్ సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులుకు అచ్యుతాపురం ఏషియన్ పెయింట్స్ హెచ్ఆర్ మేనేజర్ శివప్రసాద్ పరవాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఉమామహేశ్వర రావు గారికి శుక్రవారం మాస్కులు, శానిటైజర్ లు అందజేశారు. ఈ సందర్భంగా సి ఐ ఉమామహేశ్వర రావు  మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని పోలీసులు లాక్ డౌన్ సమయంలో తమ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. అలాగే తమ సిబ్బంది కరోనా మహమ్మారి బారి నుండి కాపాడేందుకు ఏషియన్ పెయింట్స్ వారు ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులను గుర్తించి మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఏషియన్ పెయింట్స్ హెచ్ఆర్ మేనేజర్ శివప్రసాద్ మాట్లాడుతూ సిబ్బందికి అవసరమైన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికైన మా పరిశ్రమ ముందుంటుందని సి ఐ ఉమామహేశ్వర రావు గారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ రైటర్ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Donation of masks and sanitizers to Paravada Police Station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page