పుంగనూరులో కరోనా నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు

0 128

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనాను నియంత్రించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో చైర్మన్‌ అలీమ్‌బాషా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటా జ్వరాల నమోదుతో పాటు అవగాహన కల్పించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను మున్సిపాలిటిలో కరోనా బాధితుల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే మండల ప్రజల కోసం ఆయా పంచాయతీల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు వ్యాక్సినేషన్‌తో పాటు కోవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించి, ఇండ్లకే పరిమితం కావాలన్నారు. వార్డు బాటలో కౌన్సిలర్లు కాంతమ్మ, అమ్ము,మనోహర్‌, కిజర్‌ఖాన్‌, నరసింహులు, మమత, జయభారతి, రేష్మా , పార్టీ నాయకులు రాజేష్‌, జావిద్‌, అఫ్సర్‌, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; All kinds of measures for corona control in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page