పుంగనూరు మండలంలో కరోనాను నియంత్రిస్తాం-అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 126

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని అన్ని గ్రామాల్లోను ఇంటింటికి వెళ్లి జ్వర పీడితులను గుర్తిస్తున్నామని దీని ద్వారా కరోనాను నియంత్రిస్తున్నామని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన ఎంపీడీవో రాజేశ్వరి, మెడికల్‌ ఆఫీసర్లు రెడ్డికార్తీక్‌, కిరణ్‌కుమార్‌తో కలసి ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో జ్వర పీడితులను గుర్తించి, కోవిడ్‌ సెంటర్లకు తరలిస్తున్నామని , కరోనా లక్షణాలు కలిగిన వారిని హ్గం ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. అలాగే ఈ సర్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మండలంలో ఎప్పటికప్పుడు జ్వర పీడితులను గుర్తించి, వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. మరో వైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేశామని పది రోజులలోపు కరోనాను నియంత్రిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చంద్ర, రమణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: We control the corona in the Punganur zone-Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page