బెంగాల్ లో మళ్లీ బై పోల్స్

0 20

కోల్ కత్తా ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్ లో మళ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరపలేమని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే మొత్తం ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాలతో మరో ఐదు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.పశ్చిమ బెంగాల్ లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. 213 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఫలితాలకు ముందే మూడుస్థానాల్లో ఎన్నిక అనివార్యమయింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా స్థానం నుంచి టీఎంసీ భ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. అయితే ఆయన కరోనాతో మరణించారు. అలాగే ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ లో ఆర్ఎస్పీ అభ్యర్థి ప్రదీప్ నంది మరణించారు. దీంతో పాటు శంషేర్ గంజ్ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మరణించారు.

 

 

- Advertisement -

ఇక్కడ కూడా ఎన్నిక జరగాల్సి ఉంది.ఈ మూడు స్థానాలతో పాటు మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిద్దరూ 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. రాజ్ ఘాట్ నుంచి ఎంపీగా కొనసాగుతున్న జగననాధ్ సర్కార్, కూచ్ బెహార్ స్థానం నుంచి పార్లమెంటుకు గెలిచిన నిసీత్ ప్రామాణిక్ లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.వారిద్దరూ తాము ఎంపీలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాను సారం వీరిద్దరూ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమకు ఎంపీలుగా కొనసాగాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. దీంతో మొత్తం ఐదు స్థానాల్లో పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. నందిగ్రామ్ లో మమత బెనర్జీ ఓటమి పాలు కావడంతో ఈ ఐదు స్థానాల్లో ఒక చోట నుంచి మమత బెనర్జీ పోటీ చేస్తారు. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఎన్నికలు ఇక్కడ నిర్వహించే అవకాశముంది.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Buy polls again in Bengal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page