మహిళలకు రుతుస్రావం భారం కాదు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

0 22

రుతుస్రావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల ముచ్చట్లు :

- Advertisement -

మహిళలకు రుతుస్రావం భారం కాదని దేవుడిచ్చిన ఒక వరం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.శుక్రవారం రుతుస్రావ దినోత్సవం మే 28 పురస్కరించుకుని యూనిసెఫ్ ప్రాజెక్టు టీం ,వాలంటీర్స్ టీం ఆధ్వర్యంలో రుతుస్రావ పై రూపోందిన ఆవగాహన పోస్టర్ ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ లు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు రుతుస్రావం భారం కాదని దేవుడిచ్చిన ఒక వరం అని అన్నారు…ప్రపంచవ్యాప్తంగా రుతుస్రావం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని గ్రామీణ స్థాయిలో సైతం బాలికలకు  ,మహిళా సంఘాలకు అవగాహన కల్పించడం పై ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు..కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారా అవగాహన కల్పించడం,కిశోర బాలికలకు ,ఉపాధి హామీ కూలీలకు,మహిళా సంఘాలకు వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించడం మంచి పరిణామమని అన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సానిటరీ కిట్లను అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ ,స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో ఆర్డినేటర్ హరిణి ,వాలంటీర్స్ అధ్యక్షురాలు మేన్నేని నీలిమ ,మనీషా,చిరంజీవి,రాజేశ్వర్  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Menstruation is not a burden for women
MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page