మిలాఖత్ పాలిటిక్స్ తో మార్పులు

0 44

విజయవాడ  ముచ్చట్లు :

కృష్ణా జిల్లాలో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌ నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రు. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ‌స్థాప‌కులు ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం. కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఉప్పులేటి క‌ల్పన అంత‌కుముందు టీడీపీలో ఉన్నారు. ఈ ప‌రిచ‌యాల ప్రభావంతో ఆమె 2017లో మ‌ళ్లీ టీడీపీలోకి జంప్ చేశారు. ఇక‌, ఈ క్రమంలో 2019లో కైలే అనిల్ కుమార్‌కు జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. దీంతో ఆయ‌న గెలిచారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున అదే ఎన్నిక‌ల్లో పోటీ చేసిన క‌ల్పన ఓడిపోయారు.అయితే.. కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఉప్పులేటి క‌ల్పన‌.. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌నే వార్తలు వ‌చ్చాయి. కానీ, ఎందుకో ఈక్వేష‌న్లు కుద‌ర‌లేదు. దీంతో ఆమె టీడీపీలోనే ఉన్నారు. కానీ, పార్టీ కార్యక్రమాల‌కు అటెండ్ కావ‌డం లేదు. పైగా.. పార్టీ అధినేత స‌హా.. ఇక్కడ కీల‌క నేత‌గా ఉన్న.. వ‌ర్ల రామ‌య్య (ఉండేది విజ‌య‌వాడే అయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నార‌నే పేరుంది)కు కూడా ట‌చ్‌లో ఉండ‌డం లేదు. ఇదిలావుంటే.. గ‌త ఏడాది నుంచి ఉప్పులేటి క‌ల్పన‌ వ‌ర్సెస్ అనిల్ కుమార్ మ‌ధ్య రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి.ఇద్దరు కొన్ని రోజులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకున్నా.. త‌ర్వాత మాత్రం క‌లిసిపోయి.. రాజ‌కీయాలు చేసుకుంటున్నార‌న్న టాక్ అయితే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా వినిపిస్తోంది. త‌మ‌కు ప‌నులు చేయించుకునేందుకు ఉప్పులేటి క‌ల్పన‌ ఎమ్మె ల్యేకు త‌ర‌చుగా ఫోన్లు చేస్తుండ‌డం.. ఎమ్మెల్యే కూడా త‌మ లోపాల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌ద్దనే ధోర‌ణితో ప్రతిప‌క్ష పార్టీలో ఉన్న క‌ల్పన‌తో స‌ర్దుబాటు చేసుకున్నట్టు నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వ్యవ‌హారంలో ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎవ‌రూ కూడా ఖండించ‌డం లేదు. కొన్ని మీడియాలు ఈ ఇద్దరి మ‌ధ్య ఉన్న మిలాఖ‌త్ పాలిటిక్స్‌పై క‌థ‌నాలు రాస్తున్నాయి.ఇసుక‌, మ‌ట్టి వంటి విష‌యాల్లో దూకుడుగా ఉన్నప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేను ఉప్పులేటి క‌ల్పన‌ టార్గెట్‌ చేయడం లేదు. ఇక‌.. గ‌తంలో ఎస్సీల‌కు కేటాయించిన నిధుల‌ను ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన‌ సొంతానికి వాడుకున్నార‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం చేసిన అనిల్ కూడా ఈ విష‌యం పూర్తిగా మరిచిపోయారు. దీంతో అస‌లు ఇద్దరి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం చేసుకున్నార‌నే వ్యాఖ్యలు.. వినిపిస్తున్నాయి. వ‌ర్ల రామ‌య్యకు చెక్ పెట్టేందుకే ఉప్పులేటి క‌ల్పన‌ అనిల్‌తో చేతులు క‌లిపార‌న్న టాక్ కూడా ఉంది. మ‌రి పామ‌ర్రు టీడీపీ రాజ‌కీయం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Changes with Milakhat Politics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page