మెడికల్ కాలేజీకి స్థలంపరిశీలన

0 33

విశాఖపట్నం ముచ్చట్లు :
స్థానిక ప్రాంతీయ పరిశోధన స్థానంలో 500 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 31 న వర్చ్యువల్ లో శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని శుక్రవారం శాసనసభ్యులు  గుడివాడ అమర్నాథ్ , పార్లమెంట్ సభ్యురాలు  బీశెట్టి సత్యవతమ్మ , పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్నాథ్  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని  నిర్ణయం తీసుకొని ఇప్పటికే గతంలో  మూడు కాలేజీలు పాడేరు, పులివెందుల మరొకటి  పిడుగురాళ్ల సంబంధించి గత సంవత్సరం ఫౌండేషన్ వేయడం  30 వ  తేదీతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రభుత్వం ఏర్పాటై జగన్మోహన్ రెడ్డి  పరిపాలన రాష్ట్రానికి అందించిన తరుణంలో నాడు నేడు కింద రాష్ట్రంలో మిగిలినటువంటి 13 మెడికల్ కాలేజీలు  శంకుస్థాపన చేయాలని నిర్ణయంతీసుకొని  అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునన్నారు.   గత సంవత్సరం ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు విశాఖపట్నం వచ్చిన   వైయస్ జగన్మోహన్ రెడ్డి నేనుకోరిన  పిదప  అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించిన 31వ  తేదీన పౌండేషన్ కూడా 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి  సోమవారం 31వ తారీఖున  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఫౌండేషన్ కార్యక్రమం జరగబోతుంది.. అందరి తాలూకా కృషితో అనకాపల్లికి ఒక తలమానికంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ రాకని ఈ ప్రాంత ప్రజల తరపున  ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు .ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి  చేతుల మీదుగా 31 వ తేదీన మెడికల్ కాలేజ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండేషన్ ప్రారంభించడం జరుగుతుందిన్నారు ఈకార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి  దంతులూరి దిలీప్ కుమార్ , పార్లమెంటు పరిశీలకులు  దాడి రత్నాకర్ ,  ఆర్డీవో సీతారామారావు, జోనల్ కమిషనర్ శ్రీ రామ్మూర్తి, , కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య , వైకాపా నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరి బాబు, జాజుల రమేష్, పలకా రవి, డాక్టర్ విష్ణుమూర్తి, కొణతాల మురళీకృష్ణ, పొలమరశెట్టి మురళి కృష్ణ  , ఆళ్ళ నాగేశ్వరరావు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

- Advertisement -

Tags:Site inspection for medical college

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page