యువకుడి హల్ చల్

0 25

భువనగిరి ముచ్చట్లు :
వెయ్యి రూపాయల చలానా నా వాహనానికి అనవసరం గా వేశారు అంటూ ఓ యువకుడు రోడ్డుపై హల్చల్ చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది.  లాక్ డౌన్ సమయం ఉదయం 10 గంటలు మొదలుకాగానే పోలీసులు రోడ్లపై  వెళ్తున్న వాహనాలను ఈపాస్ అనుమతి పాత్రలు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ క్రమంలో బైక్ పై వచ్చిన ఓ యువకుడు కి  పోలీసులు1000 రూపాయలు జరిమానా వేశారు.  యువకుడు నేను ఆఫీసు పని నిమిత్తం వెళుతున్నానని కేవలం ఐదు నిమిషాలు ఆలస్యమైనందుకు వెయ్యి రూపాయలు జరిమానా ఎలా విధిస్తారు అంటూ రోడ్డుపై నానా హంగామా సృష్టించాడు.  పోలీసులు చెప్పిన వారించినా వినకుండా సోషల్ మీడియాలో తన బాధను పోస్ట్ చేయడానికి ప్రయత్నించాడు.  పోలీసులు రోడ్లపై న్యూసెన్సు సృష్టించవద్దని ఆ యువకునికి సూచించినా వినిపించుకోకుండా నాకు వెయ్యి రూపాయల చలనా  ఎందుకు వేస్తారు అని పదేపదే ప్రశ్నిస్తూ దాన్ని క్యాన్సిల్ చేయాలని పోలీసులతో వాదనకు దిగాడు.  దీంతో పోలీసులు అతన్ని స్టేషన్ కి తరలించారు. లాక్ డౌన్ నిభందనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని పట్టణ పోలీసులు యువకులను హెచ్చరించారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

- Advertisement -

Tags:The young man’s hull hull

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page